Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లాడారు. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇక నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాల విషయంలో మరింత దూకుడుగా ఉంటున్నారు. అందులో భాగంగా ఆమె యశోద సినిమా చేస్తున్నారు. అది అలా ఉంటే ఆమె తాజాగా మయోసైటీస్ అనే కండరాల జబ్బుతో బాధపడుతున్నట్లు పేర్కోన్న సంగతి తెలిసిందే..