హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : షాకింగ్.. ఢిల్లీ మర్కజ్ భవనంలో ఇంత మంది ఉన్నారా..

ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవనం పేరు వింటేనే అందరి వెన్నులో వణుకుపుడుతోంది. ఇక్కడ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం దేశ్యాప్తంగా దుమారం రేపుతోంది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తబ్లీఘి జమాత్‌ సదస్సుకు హాజరైన వారి వివరాలను సేకరించి పరీక్షలు చేయడంతో పెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తబ్లీఘి జమాత్ ప్రధాన కార్యాలయం (మర్కజ్) భవనం ఎంత పెద్దగా ఉంటుంది? ఎక్కడికి ఎంత మంది వెళ్లారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మర్కజ్ భవనానికి సంబంధించి షాకింగ్ వీడియో బయటకొచ్చింది.మార్చి 26న మర్కజ్ భవనంలో పలువురు వ్యక్తులు తిరుగుతున్న వీడియోను ANI వార్తా సంస్థ విడుదల చేసింది. వందల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. వాస్తవానికి ప్రధాని మోదీ మార్చి 24నే దేశమంతటా లాక్‌డౌన్ ప్రకటించారు. మరుసటి రోజు నుంచే పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా తిరగొద్దని ప్రభుత్వాలు సూచించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా.. మార్చి 26న కూడా వీరంతా సమూహాలుగా కనిపించారు. ఒకేచోట ఉంటూ మతపరమైన ప్రార్థనలకు హాజరయ్యారు. దీన్ని బట్టే.. వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోంది. ఐతే లాక్‌డౌన్ ఉండడంతో తాము స్వస్థలాలకు వెళ్లలేకపోయామని.. అందుకే అక్కడ ఉండాల్సి వచ్చిందని కొందరు చెబుతున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading