HOME » VIDEOS » Coronavirus-latest-news

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్... హై అలర్ట్

ఇటలీ నుంచీ హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందుతోందని వివరించారు. మరో ఇద్దరిపై కూడా అనుమానం ఉందని తెలిపారు. వారి శాంపిల్స్ పుణె ల్యాబ్‌కి పంపినట్లు వివరించారు. బయటి నుంచీ వచ్చే వ్యక్తుల వల్లే తెలంగాణలో కరోనా వైరస్ వస్తోందన్న కేసీఆర్... చూస్తూ ఉండలేమన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయన్న కేసీఆర్... అంతటా షట్ డౌన్ అవుతోందన్నారు. ఫంక్షన్లు కూడా జరపట్లేదని వివరించారు. కరోనాపై తెలంగాణలో హైలెవెల్ మీటింగ్ జరుగుతోందన్న కేసీఆర్... తెలంగాణలో ఏం చెయ్యాలనేది ఆ మీటింగ్ చర్చిస్తోందన్నారు. స్కూళ్లు మూసేయాలా, ఫంక్షన్లు ఆపేయాలా అనేదానిపై హైలెవెల్ కమిటీ ద్వారా తెలుసుకుంటామన్నారు కేసీఆర్. సాయంత్రం పూర్తి వివరాలు చెబుతామన్నారు. సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించి... నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు.

webtech_news18

Top Stories