Coronavirus 2020 : కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో చేపలు, రొయ్యల వ్యాపారులు, జాలర్ల జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. వైరస్ సోకకుండా ఉండాలంటే... చేపలు, రొయ్యలు, మాంసం వంటివి తినవద్దని డాక్టర్లు సూచిస్తుండటంతో... ప్రజలు వాటిని తినేందుకు ఇష్టపడట్లేదు. ముఖ్యంగా సముద్ర చేపల వ్యాపారం బాగా పడిపోయింది. ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. చైనాలో కరోనా వైరస్... సముద్ర జీవుల ద్వారా... తమకూ వ్యాపించే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రజలు సముద్ర చేపలకు దూరంగా ఉంటున్నారు. తమ వ్యాపారాలు పడిపోయి... చేపల వ్యాపారులు, జాలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.