HOME » VIDEOS » Coronavirus-latest-news

Video : కరోనాసురుడి దహనం... ముంబైలో విచిత్రం

ముంబైలో కరోనాపై వినూత్న ప్రదర్శన నిర్వహించారు. హోళీ పండుగను పురస్కరించుకుని నిర్వహించే కామదహనానికి బదులుగా ముంబైలోని వర్లి వాసులు కరోనా దహనం చేశారు. కరోనా పేరుతో ఓ బొమ్మను తయారు చేసి దహనం చేశారు. దిష్టిబొమ్మ కింద కరోనాసుర అని రాశారు. ఇక దిష్టిబొమ్మ మెడ చుట్టూ.. కరోనా వైరస్‌ను పోలిన దండను వేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే… మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి దహనం చేశారు. ఇదిలా ఉంటే చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ 100కు పైగా దేశాల్ని చుట్టేసింది. ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య 47కి చేరింది.

webtech_news18

Top Stories