టీసీఎల్ కంపెనీ ట్రైనింగ్ కోసం వెళ్లి 58 మంది తెలుగు యువ ఇంజినీర్లు చైనాలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనా నుంచి పలుదేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో వారంతా అక్కడే ఉండిపోయారు. తమవారి గురించి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తామంతో క్షేమంగానే ఉన్నామని ఇంజినీర్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు.