ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తుంటే, వారి మీద దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కష్ట సమయంలో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులకు అభినందనలు తెలిపారు.