ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో కుటుంబసభ్యులు, అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో కలసి ఆరు బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. కరోనాపై పోరాడుతున్న అత్యవసర సేవల విభాగం అందరికీ అభినందనలు తెలిపారు.