కరోనా లాక్డౌన్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు నటుడు చిరంజీవి సెల్యూట్ చేసారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసే పోరాటంలో పాలుపంచుకుంటున్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబందించి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.