ఏపీ ప్రభుత్వ కరోనా రాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్స్ ద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్ తెలుసుకునే అవకాశం ఉందని.. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్ట్‌లు చేయవచ్చని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. మొట్టమొదటి ఇండియన్ మేడ్ వెంటిలేటర్లును తయారు చేయబోతున్నామని ఆయన అన్నారు. సీఎం జగన్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నెలాఖరు నాటికి రాష్ట్రంలో రోజుకు 4 వేల పరీక్షలు చేస్తామని చెప్పారు.