హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video : ఏపీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం..

ఆంధ్రప్రదేశ్19:46 PM April 09, 2020

ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనావైరస్‌కు మందు లేదు. ప్రస్తుతం నివారణ ఒక్కటే మన ముందున్న మార్గం. సామాజిక దూరంతోనే అది సాధ్యం. ఐతే ఇప్పటికే వ్యాధి బారినపడి వారిలో చాలా మంది కోలుకుంటున్నారు. మందు లేనప్పటికీ వీరంతా ఎలా కోలుకుంటున్నారంటే.. వారిలో ఉన్న రోగ నిరోధక శక్తే కారణం. అందుకే కరోనా అనుమానితులు, కరోనా రోగుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగా క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉన్న వారికి బలవర్ధక ఆహారం అందజేస్తున్నారు వైద్యాధికారులు. విజయవాడలోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో నిపుణుల సూచనల పేరకు స్పెషల్ మెనూతో భోజనం పెడుతున్నారు. భోజనంలో నారింజ పండ్లు, అరటి పండ్లు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూర పండ్లు అందిస్తున్నారు. వీటితో పాటు ఉడకబెట్టిన గుడ్డును కూడా పేషెంట్లకు పెడుతున్నారు. ఇది చాలా బలవర్ధమైన ఆహారం. ఇది క్రమం తప్పకుండా తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరస్‌తో పోరాడి తిరిగి సాధారణ స్థితికి కోలుకునేందుకు వీలుపడుతుంది. అన్ని ఆస్పత్రుల్లోనూ ఇలాంటి ఆహారమే అందించేలా చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading