మహిళా రక్షణ విభాగంలో అడిషనల్ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేజీవీ సరిత తన పాట ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసులు ముందున్నారని, యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత లాక్డౌన్ వేళ ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో గడుపుతుంటే.. తాము మాత్రం కంటికి నిద్ర లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నామంటూ ఎంతో చక్కగా ఆలపించారు.