ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కరోనా వివరాల సేకరణకు వెళ్లిన ఆశా కార్యకర్తపై ఓ కుటుంబం దాడికి యత్నించింది. దీంతో ఆమె భయంతో పరుగులు దీసింది. జిల్లా కేంద్రంలోని చోటా తలాబ్ కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లివచ్చాడు. వివరాల సేకరణకు వెళ్లిన సదరు వ్యక్తి సోదరుడు ఆశా కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆమె చేతిలో ఉన్న రిజిస్టర్ ను చింపివేశాడు. ఈ ఘటనతో ఆశా కార్యకర్తలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించి అధికారులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు.