హోమ్ » వీడియోలు » కరోనా విలయతాండవం

Video: ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న 72 మంది వైద్య విద్యార్థులు

అంతర్జాతీయం21:47 PM March 18, 2020

ఫిలిప్పీన్స్‌లో వరుస కరోనా మరణాలతో అక్కడి ఎమిలో అగినాల్డో కాలేజ్ Emilo Aguinaldo College(cavite)లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఏపీకి చెందిన విద్యార్థులు, భయాందోళనలు చెందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఫిలిప్పీన్స్ తమ దేశంలోని మెడికల్ కాలేజీలకు నెల 15 రోజుల వరకు సెలవులు ప్రకటించాయి. దీంతో ఆ దేశంలో రవాణా స్తంభించిపోయింది. షాపింగ్ మాల్స్‌ను మూసివేయడం, మెస్ లను కూడా మూసివేయడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఆ ప్రభుత్వం విద్యార్థులను 72 గంటల లోపల తమ తమ దేశాలు వెళ్లిపోవాలని ఆదేశించింది. విద్యార్థులు ఇండియా వద్దామనుకున్నా భారత ప్రభుత్వం కూడా ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలుపుదల చేసింది. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే ఆ దేశంలో SSP విద్యార్థులు (అంటే 18 సంవత్సరాలు వచ్చిన విద్యార్థులు) ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకోవచ్చు. అయితే ఈ విద్యార్థులు తిరిగి స్వదేశం వెళ్లి తర్వాత తిరిగి ఆ దేశం వెళ్లాలంటే వీసా కావాల్సి ఉంది. తిరిగి స్వదేశం వచ్చిన విద్యార్థులు ఏప్రిల్ ఆఖరులో తిరిగి కాలేజీకి వెళ్ళవలసి ఉంటుంది. ఏప్రిల్ 20 లోపు ఇండియాలో వీసా రానిపక్షంలో మేలో జరిగే పరీక్షలకు అందుకోలేమని, భవిష్యత్తు అంథకారం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమని స్వదేశానికి రావటానికి తగిన చర్యలు తీసుకొని, తిరిగి మేలో జరిగే పరీక్షలకు హాజరయ్యే విధంగా ఎస్ ఎస్ పి విద్యార్థులకు త్వరగా వీసా వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆంధ్ర మెడికల్ విద్యార్థులు కోరుతున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading