దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఎస్బీఐతో జియో ఒప్పందం కుదుర్చుకుంది. మై జియో యాప్‌తో ఎస్బీఐ యోనో యాప్‌ను అనుసంధానం చేసేందుకు రెండు సంస్థలు అంగీకరించాయి. ఈ మేరకు ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సమక్షంలో ఎస్బీఐ, జియో ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.