రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మొక్కలు నాటాడు. గ్రీన్ ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని జీహెచ్ఎంసీ పార్క్‌లో విశ్వక్ సేన్ మొక్కలను నాటాడు. ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను విశ్వక్ సేన్.. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ నుంచి టేకప్ చేసి ఇందులో భాగస్వామి అయ్యారు. ఇక విశ్వక్ సేన్.. అల్లు శిరీష్, శైలేష్ కొలను, కార్తికేయ, అభినవ్లకు గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసాడు.