హోమ్ » వీడియోలు » బిజినెస్

Video : కార్డు కాని క్రెడిట్ కార్డు... షరతులు లేని రుణాలు

బిజినెస్11:03 AM September 29, 2019

క్రెడిట్ కార్డు ఇవ్వాలంటే బ్యాంక్ లు సవాలక్ష షరతులు పెడతాయి. లెక్కకు మించి డాక్యుమెంట్స్ అడుగుతాయి. అది కూడా వేలల్లో జీతాలు, లక్షల వ్యాపార లావాదేవీలు ఉంటాయి. వీటితో పాటు క్రెడిట్ స్కోర్ 800 పై చిలుకు ఉంటే అప్పుడు బ్యాంక్ లు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ముందుకొస్తాయి. అయితే ఇవేమి లేకుండా మీ సంపాదన ఎంత తక్కువైనా మీకు రుణం అందించడానికి ముందుకొస్తే ఎలా ఉంటుంది? అలాంటి సేవలే అందించడానికి ముందుకొచ్చింది వీకార్డు. ఆర్బీఎల్ బ్యాంక్ తో ఒప్పందం చేసుకుని సామాన్యులకు క్రెడిట్ సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతొంది వీకార్డు. కనీస సంపాదన ఉన్న వ్యక్తులకు యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఆ రుణాన్ని మనం అన్ని అవసరాలకు వాడుకోవచ్చు. 30 రోజుల తరువాత వాడుకున్న మొత్తాన్ని కట్టేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు అంటే కార్డులు ఉండడం మనం చూశాం. కానీ ఇందులో విశేషం ఏంటంటే వీకార్డు ఎలాంటి కార్డును ఇవ్వదు. వీకార్డు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీ వివరాలు పొందుపరిస్తే మీకు ఎంత లోన్ వస్తుందో రెండు నిమిషాల్లో చెప్పేస్తారు. ఆ డబ్బు మీ యాప్ లో జమ అవుతుంది. దాన్ని మీరు సాదారణ కార్డు లాగే అన్ని అవసరాలకు వాడుకోవచ్చని వీకార్డు సీఈఓ విశాల్ రాజన్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన వీకార్డు ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం 44 నగరాల్లో వీకార్డ్ సేవాలు అందించడానికి సన్నాహాలు చేస్తోన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాల్లో సేవలు అందిస్తామన్నారు. దేశంలో తొలిసారిగా కార్డు లెస్ క్రెడిట్ కార్డును తమ సంస్థ అందజేస్తోందిని విశాల్ రాజన్ తెలిపారు.

Krishna Kumar N