భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారని రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు తాజాగా భారత్లో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలను ప్రారంభించారని చెప్పారు. లండన్లో జరుగుతున్న స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్లో నీతా అంబానీ మాట్లాడారు.