కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ చార్టెడ్ అకౌంటెంట్‌కు క్లాస్ తీసుకున్నారు. పూణెలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సీఏలతో జరిగిన ఓ సమావేశంలో ఓ సీఏ జీఎస్టీ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆయన చాలా దురుసుగా మాట్లాడారంటూ సీతారామన్ మండిపడ్డారు. పార్లమెంట్లో అందరితో చర్చించిన తర్వాత దాన్ని చట్టం చేశారని, రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలు ఆమోదించాయన్నారు. జీఎస్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని సూచించారు.