హోమ్ » వీడియోలు » బిజినెస్

Video : ఫోర్బ్స్ సంపన్నుల జాబితా.. వరుసగా 12వ సారి ముకేష్ అంబానీ టాప్

జాతీయం16:51 PM October 11, 2019

Forbes India Rich List 2019 : ఫోర్బ్స్ రూపొందించిన భారతదేశంలో సంపన్నుల జాబితాలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ రిచ్చెస్ట్ ఇండియన్స్ జాబితాలో ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది 12వ సారి. ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లని తేలింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయెన్స్ జియో కారణంగా ఆయన సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఏడాదిగా ఆర్థిక మందగమనం ఉండటంతో 2019 సంపన్నుల జాబితాలో ఉన్నవారి సంపద 8 శాతం అంటే 452 డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ వివరించింది. ఇక వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకొని రెండో స్థానానికి చేరడం విశేషం.

webtech_news18