కేంద్ర బడ్జెట్ 2020-2021 ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెట్వర్క్ 18 ఎండీ అండ్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక వ్యవస్థలో వినియోగికత పెంచడమ బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ప్రజల చేతుల్లో ఎక్కువ మొత్తంలో సంపదను ఉంచడమే మా ప్రణాళిక అని తెలిపారు. దీంతోపాటు ప్రతీ వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రధాని మోదీ రూ.100 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టాలని ఆదేశించారు.