వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్(28) హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన సిగ్నల్స్‌తో అక్కడ వాహనాలన్నీ ఆగిపోగా.. ప్రసాద్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయాడు. దాంతో కానిస్టేబుల్ అతన్ని అడ్డుకోగా.. నానా దుర్భాషలాడాడు. అక్కడితో ఆగక అతనిపై దాడికి పాల్పడ్డాడు. మధ్యలో జోక్యం చేసుకోబోయిన ఇన్‌స్పెక్టర్ జీ రాజగోపాల్ రెడ్డిని కూడా కాలితో తన్నినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి 9గంటల సమయంలో మాదాపూర్ సమీపంలోని మీనాక్షి టవర్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలను మళ్లించడానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కృష్ణ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కృష్ణపై దాడి చేసినందుకు అతనిపై ఐపీసీ సెక్షన్లు 332,353,506 కింద కేసు నమోదు చేశారు.