ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ బాధ్యతలు చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ నియామకం ఆ పదవికే వన్నె తెచ్చిందని కొనియాడారు.