హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జగన్ ప్రమాణ వేదిక దగ్గర ఈదురుగాలులు

జగన్ అనే నేను... అంటూ ఏపీ నూతన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మనకు తెలుసు. ఐతే... అర్థరాత్రి కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. దానికి తోడు ఈదురు గాలులు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ చెల్లా చెదురయ్యాయి. ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఇందిరా గాంధీ స్టేడియంలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఫ్లెక్సీలు, ఇతర ఏర్పాట్లన్నీ పాడయ్యాయి. వీఐపీల సోఫాలు తడిచిపోయాయి. నాలుగు రోజులుగా ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేస్తే, గాలి వాన వచ్చి, అన్నింటినీ నాశనం చేసేశింది. అయినప్పటికీ ధైర్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ శ్రేణులు... అర్థరాత్రంతా నిద్రపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading