ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా నేను సైతం అంటూ రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి ఆయన కొవ్వొత్తులు వెలిగించారు.