Andhra Pradesh : గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతల కార్లను వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. టీడీపీ నేతల నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారనీ, నామినేషన్ పత్రాలు చించేశారనీ, టీడీపీ శ్రేణులపై దాడి చేశారని తెలియడంతో... వారిని పరామర్శించేందుకు, వాస్తవాలు తెలుసుకునేందుకూ టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కార్లలో వెళ్లారు. ఐతే... టీడీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో కాపుకాసి దాడి చేశారు వైసీపీ వర్గీయులు. బుద్ధా, బోండా ఉమ ఉన్న కారుపై కర్రలతో దాడి చేయడంతో... కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతలో కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి... కారును ముందుకు నడపడంతో... తీవ్ర దాడి నుంచీ బయటపడినట్లైంది. బోండా ఉమకు స్వల్ప గాయాలవ్వడంతో... ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారని తెలిసింది.