శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం ముందుకు వచ్చిన ఎలుగుబంటి.. అక్కడ కలియదిరిగింది. అయితే.. దాన్ని చూసిన వీధికుక్కలు మొరుగుతూ దాన్ని భయపెట్టాయి. వాటి అరుపులకు భయపడ్డ ఎలుగుబంటి పరుగు లంఘించుకుంది. దాన్ని వెంబడించిన కుక్కలు అక్కడి నుంచి తరిమికొట్టాయి.