HOME » VIDEOS » Andhra-pradesh

Video : మా ఊరులో మద్యం దుకాణం వద్దు.. గ్రామస్తుల ధర్నా

ఆంధ్రప్రదేశ్17:55 PM September 27, 2019

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని చియ్యవరం గ్రామస్తులు రెండు రోజులుగా ధర్నా చేపట్టారు. మా ఊర్లో మద్యం దుకాణం వద్దు అంటూ వారు నిరసన తెలియజేస్తున్నారు. ఈ గ్రామంలో చాలా మంది కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరు కుటుంబాలను పట్టించుకోకుండా, సంపాదనలో ఎక్కువ శాతం సారా తాగటానికే ఖర్చు చేస్తున్నారు. ఈ మద్యం మా గ్రామాలలో వద్దు బాబోయ్ అంటూ మద్యం దుకాణాల వద్ద సామూహిక భోజనాలు వండుకొని అక్కడే భోజనాలు చేస్తూ గ్రామస్తులు నిరసన తెలియజేసారు. మా గ్రామంలో మద్యం దుకాణాన్ని రద్దు చేయండి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మద్యం దుకాణాన్ని తొలగించాలని వారు అధికారులకు విన్నవించుకున్నారు.

webtech_news18

Top Stories