HOME » VIDEOS » Andhra-pradesh

Video : శ్రీశైలంకు పోటెత్తుతున్న వరద

ఆంధ్రప్రదేశ్13:02 PM August 09, 2019

ఎగువన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జునసాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది.గురువారం ఉదయం 10గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,60,345 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 99,648 క్యూసెక్కులుగా ఉంది.నాగార్జునసాగర్‌లో ఇన్‌ఫ్లో 74650 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 2429 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్‌లోకి మరో వారం రోజుల పాటు భారీ వరద కొనసాగే అవకాశం ఉండటంతో.. నేటి సాయంత్రం గేట్లు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాజెక్టు గేట్లు తెరవనున్నారు.కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆపై గేట్లను తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవల్ 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 187.49 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ప్రాజెక్టు పూర్తి ఎత్తు 980 అడుగులు కాగా, ప్రస్తుతం 879.86 అడుగుల మేర నీరు చేరింది. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో డ్యామ్ పూర్తిగా నిండుకోవడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు.

webtech_news18

Top Stories