విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి రామభద్రపురం వరకు పార్వతి పురం నుండి కునేరు వరకు రోడ్డు దారుణంగా ఉంది. రోడ్డు వేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ప్రజలు వినూత్న నిరసనకు దిగారు .కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం గ్రామం వద్ద రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ ఒక వ్యక్తి బురదలో ఈత కొడుతూ నిరసనను తెలియజేసాడు.