భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖుర్దా జిల్లాలోని బాలుగావ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్ నుంచి రైలు బోగీలు విడిపోయాయి. రైలు ఇంజిన్ అలాగే కొద్ది దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలు విడిపోయాయని గ్రహించిన లోకో పైలెట్లు ఇంజిన్‌ను నిలిపివేసి.. మెయింటెనెన్స్ టీమ్‌కు సమాచారం అందించారు. దాదాపు గంట తర్వాత మరమ్మతులు చేశాక రైలు తిరిగి బయలులేరి వెళ్లింది.