విజయవాడ వెళ్లిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎయిర్‌పోర్టును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం విజయవాడకు బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రెస్ మీట్‌కు పర్మిషన్ లేదన్నారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.