విజయవాడలోని కృష్ణా తీరం శోభాయమానంగా మారింది. నగరంలోని స్నాన ఘాట్లన్ని పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల రద్దీతో సందడి నెలకొంది. కార్తీక మాసం చివరి రోజున భక్తులు పవిత్ర కృష్ణా తీరంలో భక్తిశ్రద్ధలతో పూజాధికాలు చేయడంతో పాటు అరటిడొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదిలారు.