హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : వినాయకుడి ఊరేగింపులో చెలరేగిన మంటలు... తగలబడిన విగ్రహం

ఆంధ్రప్రదేశ్11:08 AM September 09, 2019

Andhra Pradesh : ఏపీ... అనంతపురం జిల్లా... హిందూపురంలో జరిగిందీ ఘటన. వినాయకుడి నిమజ్జనం కోసం... విగ్రహాన్ని తరలిస్తూ... ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం ఊరేగింపులో పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతుంటే... ఊరేగింపు ముందుకు సాగుతోంది. ఇంతలో... విగ్రహం అంబేద్కర్ సెంటర్‌కు వచ్చాక... బాణసంచా కాల్చుతూ... తారాజువ్వల్ని గాల్లోకి ఎగరేశారు. వాటిలో ఒకటి... విగ్రహంపై పడింది. అంతే... మంటలు అంటుకున్నాయి. అక్కడ గాలి బాగా వస్తుండటంతో... క్షణాల్లో మంటలు... పెద్దవయ్యాయి. సింహం కటౌట్‌కి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కుర్రాళ్లు... కేకలు వేస్తూ... అందర్నీ అలర్ట్ చేస్తూ... మంటల్ని ఆర్పేందుకు రకరకాలుగా ప్రయత్నించారు. లక్కీగా మంటలు త్వరగానే అదుపులోకి వచ్చాయి. ఇలాంటి పొరపాట్లు ప్రతి చోటా జరుగుతున్నాయన్న పోలీసులు... అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మరీ రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లవద్దనీ, తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంటుందనీ హెచ్చరిస్తున్నారు.

Krishna Kumar N