అమరావతిలో పర్యటించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు టీడీపీ అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నించిందని.. లేనిదాన్ని ఉన్నట్లు చెప్పడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అమరావతి ఆందోళనల్లో మహిళలపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఏపీలో పర్యటించారు.