ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హెడ్డా సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం జగన్‌తో భేటీ అయిన కేథరిన్ హెడ్డా.. అరగంట పాటు పలు విషయాలపై చర్చించారు. కాగా, లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ మోహన్‌రెడ్డికి హడ్డా గతంలో ట్విట్టర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు.