హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమల వెంకన్నకు రూ.14 కోట్ల విరాళం

ఆంధ్రప్రదేశ్11:34 AM August 10, 2019

తిరుమల తిరుపతి దేవస్థానం... నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు వెంకన్న దర్శనం కోసం వస్తూ ఉంటారు. తాజాగా యూఎస్‌కు చెందిన ఎన్నారైలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడు కొండలవాడికి రూ.14 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డికి చెక్కును అందించారు. తాము ఇచ్చే ఈ మొత్తాన్ని టీటీడీకి సంబంధంచిన అన్నీ సేవా కార్యక్రమాల్లో వినియోగించాలని కోరారు. అయితే ఈ ఇద్దరు ఈ ఏడాదే కాదు.. గత ఏడాది కూడా స్వామివారికి భారీ విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత ఏడాది జూలైలో ఎన్నారైలు ఇద్దరు కలిసి దాదాపు రూ. 13.5 కోట్లు స్వామివారికి విరాళం ఇచ్చినట్లుగా తెలిపారు.

Krishna Kumar N