విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు సరిగా అమలుచేయడం లేదని..అవకతవకలకు పాల్పుడుతున్నారని ఆరోపించారు. ఆఫీస్ ఎదుటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు చేరుకొని వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.