హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఒంగోలు గిత్తలతో పోటీ పడుతున్న అక్కాచెల్లెళ్లు

ఆంధ్రప్రదేశ్02:35 PM IST Jun 07, 2019

ఠీవీకి, రాజసానికి, పౌరషానికి ఒంగోలు గిత్తలు పెట్టింది పేరు. వాటికి ముక్కుకి తాడు వేయడం చాలా కష్టం. కానీ, ఇద్దరు అక్కాచెల్లెల్లు మాత్రం ఆ ఒంగోలు గిత్తల్నే, చిన్న పిల్లల్లా ఆటాడిస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ఈశ్వరమ్మ, వరలక్ష్మీ ఒంగోలు గిత్తల మీద ఉన్న ప్రేమతో వాటిని పెంచుతూ.. పోటీల్లో పాల్గొంటున్నారు. సాటి లేని రోగ నిరోధక శక్తి, కదన రంగంలో కాలు దువ్వేటప్పుడు గిత్తలు వేసే రంకెలు చూస్తే... సింహాలు కూడా ఓ అడుగు వెనక్కు వేయాల్సిందే. అలాంటి ఒంగోలు గిత్తలతో ఈ అక్కాచెల్లెల్లు లేగదూడల్లా ఆడుకుంటున్నారు. పశు ప్రేమికులకు ఎంతో ఇష్టమైన.. బలప్రదర్శన పోటీలు ఎక్కడ జరిగినా వాలిపోతున్నారు. వందల కేజీల బండలను గిత్తలు లాగేలా చేస్తూ.. మగాళ్లకు సవాల్ విసురుతూ ప్రైజులు గెలుస్తున్నారు.

Krishna Kumar N