ఏపీ రాజధాని అమరావతి నుంచీ తరలిపోతుండటంతో అక్కడి రైతులు ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా తుళ్లూరులో రోడ్డుపై టెంట్ వేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తమను రోడ్డున పడేసి... చివరకు టెంట్ కూడా వేసుకోనివ్వట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో తుళ్లూరులో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.