తమిళనాడులో పట్టుబడిన టీటీడీ బంగారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఓ వాహనంలో తరలిస్తున్న 1,380 కిలోల బంగారాన్ని ఎన్నికల అధికారులు పట్టుకోవడం సంచలనం రేపింది. ఆ వ్యవహారంపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం విచారణకు ఆదేశించడంతో ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. తమిళనాడులో పట్టుబడిన బంగారం తమదేని...ఐతే తరలింపుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. గోల్డ్ స్కీమ్‌లో జమచేశాక.. తిరిగి తమకు అప్పగించే వరకు సదరు బ్యాంకే బాధ్యత వహిస్తుందని చెప్పారు.