కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శ్రీ యోగ వైశిష్యం ధన్వంతరీ మహా మంత్ర పారాయణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రుత్వికులతో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు స్తోత్ర పారాయణ జపం చేశారు.