శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి పెను ప్రమాదం తప్పింది. జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిన విషయాన్ని లైన్మెన్ ముందుగానే డ్రైవర్‌కి తెలియజేయడంతో ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా రైలును నిలిపివేసి ప్రమాదం నుంచి తప్పించాడు.