HOME » VIDEOS » Andhra-pradesh

ఆత్మకూర్‌ ఉపఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం

Atmakur : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం ఆత్మకూర్ ( Atmakur ) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైసీపీ(YCP) భారీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి, దివంగత మంత్రి- స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ స్థానంలో పోటీచేసి ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు.

మొత్తం 20 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. రౌండ్ రౌండ్ కూ మేకపాటి విక్రమ్ రెడ్డి మెజారిటీ పెంచుకుంటూ పోయారు. ఈ ఎన్నికల్లో దాదాపు లక్ష 25వేల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో 1లక్ష 2వేల 74 ఓట్లు మేకపాటి విక్రమ్ రెడ్డికి పడ్డాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 19,332 ఓట్లు పోలయ్యాయి. దీంతో..  82,883 ఓట్ల మెజారిటీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టుగా అధికారులు ప్రకటించారు.



జూన్ 23, 2022న ఆత్మకూర్ లో బైపోలింగ్ జరిగింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గత 2019 ఎన్నికల్లో ఆత్మకూర్‌లో 83.32శాతం ఓట్లు పోల్ కాగా.. ఈసారి 64.14శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఉపఎన్నికలో టీడీపీ (TDP) పోటీ చేయలేదు. జాతీయ పార్టీలైన బీజేపీ (BJP),  బీఎస్పీ (BSP) క్యాండిడేట్లను నిలబెట్టాయి. టీడీపీ ఓటర్లు కొందరు పోలింగ్ లో పాల్గొనలేదని.. పోలైన ఓట్లు బీజేపీకి, బీఎస్పీకి, నోటాకు పడ్డట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read This : Free Coaching for IBPS: ఐబీపీఎస్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. ఆన్లైన్లో బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీకోచింగ్

తనకు భారీ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని.. అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని విక్రమ్ రెడ్డి తెలిపారు.


మరోవైపు.. ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడిందని కొన్నిచోట్ల రిగ్గింగ్ చేసిందని.. భారీగా డబ్బు పంచిందని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి కుమార్ యాదవ్ ఆరోపించారు. అలాగే వాలంటీర్ల చేత ప్రచారం చేయించి డబ్బులు ఇచ్చారనీ.. వైసీపీకి ఓటు వేయకపోతే రేషన్ కార్డు, పెన్షన్ రద్దు చేస్తామని వాలంటీర్లు ఓటర్లను బెదిరించారని భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 30 మంది వైసీపీ ముఖ్య నాయకులు కలిసి కనీసం లక్ష మెజారిటీ కూడా తీసుకరాలేకపోయారు అని ఎద్దేవా చేశారు. ఏమాత్రం పట్టు లేని ఆత్మకూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 20 వేల ఓట్లు సాధించింది అంటే నైతిక విజయం తమదేనని భరత కుమార్ యాదవ్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరించిందని నోట్ల కట్టలు భారీగా పంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు.

V. Parameshawara Chary

Top Stories