టీటీడీ పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం చేసిన నిందితుల్ని గుర్తించారు. భక్తుల ముసుగులో గుడికి వచ్చిన భక్తులే కిరిటాల్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అర్చకులు లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు చాకచక్యంగా కిరిటాలని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చారు. కిరీటాల చోరీ ఘటనలో ఆలయ సిబ్బంది, అర్చకుల ప్రమేయంపై అధికారులు తొలుత విచారణ చేపట్టారు. అయితే, వారి హస్తం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొందరు అనుమానితులను గుర్తించారు. తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.