తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను మళ్లీ తెరిచారు. సూర్య గ్రహణ ప్రభావంతో నిన్న రాత్రి ఆలయ తలుపులను మూసివేయగా.. గ్రహణం ముగియగానే తలుపులను తెరిచారు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభం కానుంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.