తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల విందుగా కొనసాగుతున్నాయి. ఈరోజున ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, గుర్రాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డప్పుల వాయిద్యాలు నడుమ ఊరేగింపు రమణీయంగా సాగింది.