హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఏపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... ముగ్గురు సజీవదహనం

ఆంధ్రప్రదేశ్05:46 PM IST Jun 14, 2019

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బొబ్బిలిలోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలడంతో దట్టమైన పొగలతో పాటు భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. మృతులను బొబ్బిలి మండలం అలజంగికి చెందిన జగదీశ్‌, బాడంగి మండలం గొల్లాదికి చెందిన సురేష్, భీమవరం గ్రామానికి చెందిన చింతల గోపాలనాయుడుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

webtech_news18