కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశాపురం గ్రామ సమీపంలోని రహదారిపై లారీ-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు.బెంగళూరు నుంచి కడపకు వెళ్తున్న కారు.. అతివేగంతో లారీని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా.. వీరంతా కడప వాసులేనని గుర్తించారు. కారు అతివేగంతో లారీని ఢీకొట్టడంతో.. మృతదేహాలు కూడా నుజ్జనుజ్జయిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.