హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పశ్చిమ గోదావరిలో దారుణం.. వరదలతో ఇద్దరు గల్లంతు..

ఆంధ్రప్రదేశ్18:26 PM August 09, 2019

గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గ్రామాలతోపాటు కోనసీమలోని లంక గ్రామాలు వణికిపోతున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద పాటు రేవు కాజ్‌ వే మునిగిపోవడంతో పెద్దపట్నలంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐ.పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంక గ్రామాలకు బాహ్య ప్రపంచతో సంబంధాలు తెగిపోయాయి. అయితే, అప్పనపల్లిలో మునిగిన కాజ్‌వేను దాటుతుండగా నీటి ప్రవాహానికి ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. వారిలో ఒకర్ని కాపాడారు. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చేపట్టారు.

Shravan Kumar Bommakanti